సరిహద్దుల్లో భారత్, చైనా సైన్యం బాహాబాహీ.. పలువురికి గాయాలు

సిక్కిమ్ సెక్టార్‌లోని నాథులా కనుమ వద్ద భారత్, చైనా బలగాలు ముఖాముఖీ తలపడుతున్నట్టు అధికారిక వర్గాలు ఆదివారం వెల్లడించారు. భారత్-చైనా సరిహద్దుల్లో సైనికులు బాహాబాహీ తలపడ్డారని, ఈ ఘటనలో ఇరువైపులా పలువురు గాయపడ్డారని పేర్కొన్నాయి. అయితే, స్థానిక స్థాయి అధికారులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగిందని తెలిపాయి. ఆగస్టు 2017 తర్వాత భారత్, చైనా సైన్యం బాహాబాహీ తలపడటం ఇదే తొలిసారి. లడక్‌లోని పెంగాంగ్ సరస్సు వద్ద చివరిసారి డ్రాగన్ సైన్యంతో భారత్ సేనలు గొడవపడ్డాయి.

Read Also:

భారత్‌ భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను భారత ఆర్మీ దీటుగా ఎదుర్కొంది. దీంతో డ్రాగన్‌ తోక ముడిచింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనికులూ ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు.‘ప్రోటోకాల్ ప్రకారం సరిహద్దుల్లో ఇటువంటి సమస్యలను సేనలు పరస్పరం పరిష్కరిస్తాయి. ఈ సంఘటన చాలా కాలం తరువాత జరిగింది’ అధికార వర్గాలు తెలిపాయి.

Read Also:

తాజా ఘటనలో 150 మందికిపైగా సైనికులు పాల్గొన్నారు. సరిహద్దుకు ఇరువైపుల అవగాహన లోపంతో కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయని ఆ వర్గాలు తెలిపాయి. దాదాపు మూడేళ్ల కిందట 2017లో భారత్, చైనా సైన్యాలు 73 రోజుల పాటు డోక్లామ్‌లో తలపడ్డాయి. డోక్లామ్ వివాదంలో చైనా బెదరింపులకు తలొగ్గకుండా పట్టుదలతో వ్యవహరించి భారత్ విజయం సాధించింది. సిక్కిమ్ సరిహద్దుల్లోని డోక్లామ్‌లో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ సైన్యం అడ్డుకుంది. దీనిపై చైనా కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యింది.

Read Also:

డోక్లామ్‌లో చైనా సేనలను అడ్డుకుని తీవ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడుల కంటే ప్రమాదకరమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారు. చైనా యుద్ధానికి రెచ్చగొట్టినప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతియుత చర్చలు ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించింది.

Read Also:

భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఈ ప్రాంతంలో ఉండే అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగమేనని, దక్షిణ టిబెట్‌గా చైనా పేర్కొంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here