షాకింగ్‌.. కేంద్ర ఆరోగ్య‌మంత్రి సిబ్బందికి క‌రోనా.. ఆఫీస్ మూసివేత‌

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తున్న సంగ‌తి తెలిసిందే. సామ‌న్యుల నుంచి సెల‌బ్రిటీల దాకా అంద‌రూ ఈ వైర‌స్ బారి నుంచి త‌ప్పించుకునేందుకు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే కేంద్ర ఆరోగ్య‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కార్యాల‌య సిబ్బంది ఒక‌రికి క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) సోకింది. ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య‌మంత్రి కార్యాలయంలో ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ (ఓఎస్డీ)గా విధులు నిర్వ‌రిస్తున్న అధికారికి క‌రోనా వైర‌స్ సోకింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు స‌ద‌రు ఆఫీస‌ర్‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. మ‌రోవైపు కేంద్ర‌మంత్రి కార్యాల‌యాన్ని అధికారులు మూసివేశారు.

Must Read:

మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతానికి దేశ‌వ్యాప్తంగా 28,800కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 880 మందికిపైగా క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణంచారు. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఇప్ప‌టికే 8వేల‌కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 342 మంది మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాతి స్థానాల్లో గుజ‌రాత్ (3300), ఢిల్లీ (2900), రాజ‌స్థాన్ (2180), మ‌ధ్య‌ప్ర‌దేశ్ (2090), త‌మిళనాడు (1880), ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (1870), ఆంధ్ర‌ప్ర‌దేశ్ (1097), తెలంగాణా (1001)లో 1000కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here