వ్యాక్సిన్ వచ్చినా కరోనా ముప్పు పోదు.. మరోసారి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. కరోనా మన జీవితాల నుంచి ఎన్నటికీ పోదని, దానితో కలిసి ప్రయాణం చేయాల్సిందేనని హెచ్చరించింది. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వైరస్‌ను నియంత్రించడం కష్టమైన పని అని.. ఇందు కోసం ప్రపంచం పెద్ద కసరత్తే చేయాలని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ నిపుణుడు మైక్ రియాన్ వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారి కూడా హెచ్‌ఐవీ మాదిరిగానే వెంటాడుతుందని అన్నారు. కరోనా మహమ్మారి మనతో పాటు జీవనం కొనసాగిస్తుందని.. ఇది పూర్తిగా అంతం అవుతుందని ఎవ్వరూ అంచనా వేసే స్థితి లేదని ఆయన పేర్కొన్నారు. దీన్ని నియంత్రించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మన కర్తవ్యం అదేనని ఆయన పునరుద్ఘాటించారు.

‘మనం వాస్తవికంగా ఉండటం ముఖ్యం.. ఈ వ్యాధి ఎప్పుడు అదృశ్యమవుతుందో ఎవరూ ఊహించలేరు.. దీనిపై ఎలాంటి ప్రమాణాలు, తేదీలు చెప్పలేం.. ఇది దీర్ఘకాలిక సమస్యగా ఉండొచ్చు.. లేకపోవచ్చు’ రియాన్ అన్నారు. అయితే, వ్యాక్సిన్ వస్తే కొంత నియంత్రణలో ఉంటుంది.. కానీ, భారీ ప్రయత్నంతో టీకా అందుబాటులోకి వచ్చినా మహమ్మారిని కట్టిడి చేయడం ఇంత సులభం కాదన్నారు.

క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నవి సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100కిపైగా వ్యాక్సిన్‌లు తయారీకి ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.. కానీ, వ్యాక్సిన్‌‌లు ఏ మేరకు ప్రభావం చూపుతయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రియాన్ అన్నారు. వ్యాక్సిన్స్ వల్ల కొత్త వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. వైరస్ కట్టడి మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ దీనిని నియంత్రించడానికి సహకరించాలని అన్నారు. ముప్పును తగ్గించడానికి వైరస్ నియంత్రణ చాలా ముఖ్యమని, ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ స్థాయిలో దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుహేళ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మృతిచెందిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. వైరస్‌ బాధితుల సంఖ్య 44. 30 లక్షలను సమీపించింది. కోలుకున్నవారి సంఖ్య 16.60 లక్షలకుపైగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. తొందరపాటుతో ఆంక్షలను ఎత్తివేస్తే.. నియంత్రించలేని స్థాయిలో వైరస్‌ విజృంభించే ముప్పుందని, మరణాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here