వైన్‌షాప్ వాచ్‌మెన్ దారుణహత్య… ‘పశ్చిమ’లో కలకలం

లాక్‌డౌన్‌ కారణంగా తగ్గిన నేరాలు మళ్లీ మొదలయ్యాయి. కొద్దిరోజులుగా మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు తరుచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జిల్లా మండలం దుద్దుకూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లిపూడి వెంకటేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. వెంకటేష్ స్థానికంగా ఓ వైన్‌షాపు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.

Also Read:

వెంకటేశ్ కుటుంబసభ్యులు, స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడు వైన్‌షాపులో వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటంతో మద్యం సీసాల దొంగతనం కోసం వచ్చిన వారెవరైనా చంపేశారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తుస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here