విశాఖ చిన్నారి జ్ఞ‌ానస కేసులో షాకింగ్ ట్విస్ట్.. తల్లి కుసుమలత ఆత్మహత్య

సుమారు మూడు నెలల కిందట ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ చిన్నారి జ్ఞ‌ానస హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఏడాదిన్నర వయస్సున్న కూతురిని హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి కుసుమలత(27) ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇటీవల బెయిల్‌పై విడుదలైన కుసుమలత పెందుర్తి పరిధి పురుషోత్తమపురంలోని పుట్టింట్లో ఉంటోంది.

గత నెల 27న ఆమె ఇంట్లో ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను విశాఖలోని కేజీహె‌చ్‌కి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుసుమలత మృతి చెందింది. భర్త, అత్తింటి వరకట్న వేధింపులు తాళలేక తమ కూతురు మరణించిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అత్తింటి వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:

పెందుర్తి సమీపంలోని పులగానిపాలేనికి చెందిన అప్పారావుతో కుసుమలతకు ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి సోనిక, ఏడాదిన్నర వయసున్న జ్ఞ‌ానస సంతానం. కుటుంబ కలహాల కారణంగా ఫిబ్రవరి 6వ తేదీన తన కూతురు జ్ఞానసను తీసుకుని కుసుమలత ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఏడాదిన్న చిన్నారి ఏమైందన్న విషయం చర్చనీయాంశమైంది.

ఎట్టకేలకు మూడు రోజుల తరువాత చినముషిడివాడ ప్రాంతంలోని కాటమయ్య కొండపై కుసుమలత ఆచూకీ కనిపెట్టారు. అయితే అప్పటికే ఆమె వద్ద చిన్నారి జ్ఞ‌ానస లేదు. కొండపై గుంతతీసి పూడ్చిపెట్టిన చిన్నారి జ్ఞానసను పోలీసులు గుర్తించారు. కన్నకూతురి హత్య కేసులో తల్లి కుసుమలత అరెస్టైంది. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన కుసుమలత ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించింది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here