వావ్! అదే ‘స్పిరిట్’: వడగండ్లు కురుస్తున్నా చెక్కుచెదరని మద్యంప్రియులు

లాక్‌డౌన్‌తో మూతబడ్డ దాదాపు నెల రోజుల తర్వాత తెరుచుకోవడంతో మద్యంప్రియులు ఎగబడ్డారు. వైన్ షాపుల మందు కిలోమీటర్ల మేర బారులు తీరారు. కొంత మంది సంచులు తీసుకెళ్లి నెల రోజులకు సరిపడా సరుకు తెచ్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల సామాజిక దూరం ప్రశ్నార్థకంగా మారింది. గుంపులు గుంపులుగా లిక్కర్ కోసం ఎగబడ్డారు. వైన్స్ ముందు అప్పటికే భారీ క్యూలైన్లు ఉన్నా లెక్క చేయకుండా లైన్లలో నిలబడుతున్నారు. ఎండ కూడా లెక్క చేయకుండా లిక్కర్ కోసం తమ ‘స్పిరిట్’ కొనసాగించారు. మగవాళ్లతో పోటీ పడుతూ మహిళలు కూడా మద్యం కోసం పోటీపడ్డారు.

Also Read:

ఏపీ, ఢిల్లీ, కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో సోమవారం (మే 4) ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అయితే.. మంగళవారం మరింత ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో మంగళవారం మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయినా.. మద్యంప్రియులు వెరవలేదు. ఓ వైన్స్‌ దుకాణం వద్ద మద్యంప్రియులు వడగండ్లు పడుతున్నా క్యూలైన్ నుంచి ఒక్క అడుగు కదపలేదు. అదే స్ఫూర్తి కొనాసాగిస్తూ దీక్షతో లైన్లలో నిలబడి మద్యం సీసా చేతిలో పడిన తర్వాతనే ఇంటిబాట పట్టారు.

ఇలాంటి దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొంత మంది ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. ‘పట్టుదల అంటే ఇది! ఏమైపోయినా ఫర్వాలేదు గానీ రాష్ట్ర ఆదాయానికి పన్ను కట్టాలి అనే ఆశయం ఉంది చూశారా మాస్టారూ! అది కావాలి అందరిలో!’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here