‘లుడో’ ఆటలో ఓడించిందని భార్య వెన్నుముక విరగ్గొట్టిన భర్త

లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలామంది అష్టాచ‌మ్మా, వైకుంఠ‌పాళీ లాంటి పాత ఆటలతో అనేక ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇలాగే ఓ భార్యాభర్తలు సరదా మొదలెట్టిన లూడో ఆట భార్యను ప్రమాదంలోకి నెట్టేసింది. కరోనా సోకుతుందనే భయంతో ఓ మహిళ తన భర్తను ఇంటికే పరిమితం చేయాలనుకుంది. కాలక్షేపం కోసం మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ లూడో ఆట ఆడదామని భర్తకు చెప్పింది. అతడూ సరే అనడంతో ఇద్దరూ కలిసి ఆడటం మొదలుపెట్టారు. అయితే భర్త ఆమె చేతిలో నాలుగు సార్లు వరుసగా ఓడిపోడాడు. దీంతో అతడు ఉక్రోశం పట్టలేక భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె గట్టిగా మాట్లాడటంతో భార్యను కిందేసి తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె వెన్నుముక కదిలిపోయింది. బాధతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Also Read:

వివరాల్లోకి వెళ్తే… గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ మహిళ ట్యూషన్‌ టీచర్‌గా పని చేసతోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖాళీగా ఉండడంతో భర్తతో లుడో గేమ్‌ ఆడాలకుంది. అతడూ సరే అనడంతో ఆన్‌లైన్లో గేమ్ మొదలుపెట్టారు. వారితో పాటు కాలనీలోని మరికొంత మంది కూడా ఆన్‌లైన్‌లో లూడో గేమ్‌ ఆడారు. అయితే వరుసగా నాలుగు సార్లు ఆమె చేతిలో భర్త ఓడిపోయాడు. దీంతో ఆక్రోశంతో ఆమెపై గొడవకు దిగాడు. ఇది కాస్తా పెద్దది కావడంతో భార్యను కింద పడేసి కాలితో తన్నాడు.

Also Read:

అతడి దెబ్బలకు ఆమె వెన్నుముక పక్కకు జరిగిపోయింది. బాధితురాలి కేకలతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె వెన్నుముకు విరిగిపోయిందని, సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని భర్తపై కేసు నమోదు చేశారు. అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో తప్పు జరిగిందని అంగీకరించాడని, అనంతరం బాధితురాలు కేసు వాపసు తీసుకుందని పోలీసులు తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here