లాక్‌డౌన్-4కు కొత్త నిబంధనలు.. మే 18కి ముందు వివరాలు: ప్రధాని మోదీ

లాక్‌డౌన్ 4.0 గురించి మే 18కి ముందు వెల్లడిస్తామని తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. లాక్‌డౌన్ నాలుగో దశలో కొత్త నిబంధనలు ఉంటాయని మోదీ తెలిపారు. లాక్‌డౌన్ విషయమై రాష్ట్రాల సలహాలను స్వీకరిస్తామని ప్రధాని తెలిపారు. కరోనా మనతోపాటు దీర్ఘకాలం ఉంటుందని శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారని ప్రధాని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలతో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు ఖాయమని తేలింది. ఆత్మ స్థయిర్యంతో ముందుకెళ్తూ కరోనాపై పోరాటం చేద్దామని మోదీ పిలుపునిచ్చారు.

మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలుత రెండు వారాలపాటు

‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దేశ జీడీపీలో ఇది పది శాతానికి సమానమని ప్రధాని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వడం కోసం ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆర్థిక ప్యాకేజీ గురించి పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి వెల్లడిస్తారని మోదీ తెలిపారు. భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందన్నారు.

21వ శతాబ్దం భారత్‌దేనన్న ప్రధాని.. కరోనా వైరస్ పోరాటంలో మన దేశం ఉత్పత్తి చేస్తున్న ఔషధాలు ప్రపంచ దేశాలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయన్నారు. స్థానిక ఉత్పత్తుల తయారీకి, వాడకానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here