రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

రై లు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్.. మంగళవారం నుంచి ప్రారంభమైన ప్రత్యేక రైళ్లలో ప్రయాణీకుల కోసం వెయిటింగ్ లిస్టులు కూడా అందుబాటులోకి రానున్నాయి. మే 22 నుంచి ప్రారంభమయ్యే ప్రయాణాలకు వెయిటింగ్ జాబితాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు భారత రైల్వే బుధవారం (మే 13) ప్రకటించింది. మే 15 నుంచి బుక్ చేసుకున్న టికెట్ల కోసం ఈ సౌలభ్యం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అయితే ఈ సంఖ్య పరిమితంగానే ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రత్యేక రైళ్ల కోసం వెయిటింగ్ లిస్ట్ ఏసి 3 టైర్‌కు 100, ఏసి 2 టైర్‌కు 50, స్లీపర్ క్లాస్‌కు 200, చెయిర్ కార్‌కు 100 చొప్పున, మొదటి ఏసి, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు 20 చొప్పున మాత్రమే వెయిటింగ్ లిస్ట్ ఉండనుంది. అంతకుమించి బుకింగ్ యాక్సెప్ట్ కాదని రైల్వే శాఖ తెలిపింది. ప్రత్యేక రైళ్లలో ఆర్‌ఏసీ ఉండదని భారత రైల్వే ఇప్పటికే స్పష్టం చేసింది.

వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి మాత్రమే రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. స్టేషన్లలో నేరుగా టికెట్లను విక్రయించే పద్ధతిని ప్రారంభించలేదు. గుర్తింపు పొందిన ఏజెంట్ల (ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు, రైల్వే ఏజెంట్లు) ద్వారా కూడా ప్రస్తుతం టికెట్ల బుకింగ్ అనుమతించడం లేదు. ఇంతకుముందులా ప్రయాణానికి 3 నెలల ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే ఆప్షన్ కూడా లేదు. గరిష్టంగా ఏడు రోజుల వరకు మాత్రమే రిజర్వేషను చేసుకోవచ్చు.

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రయాణికులు పలు నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. బయలుదేరేటప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవాలి. భౌతిక దూరం పాటించడానికి పలు ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ లక్షణాలు లేని వారినే రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. రైళ్లలోనే ఆహారం అందిస్తారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here