రేపింగ్ బ్రదర్స్.. జాలీరైడ్ పేరుతో అమ్మాయిల కిడ్నాప్.. ఫుల్లుగా తాగించి..

జాలీరైడ్ పేరుతో అమ్మాయిలను కిడ్నాప్ చేసి లైంగికంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కామపిశాచాలుగా మారిన ఇద్దరు అన్నదమ్ములు నడిచివెళ్తున్న టీనేజ్ యువతులను రైడ్ పేరుతో ఎక్కించుకుని బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లి దారుణంగా చేశారు. అమ్మాయిలతో గంజాయి మద్యం తాగించి మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన న్యూజెర్సీలో వెలుగుచూసింది.

మైనర్ బాలికలకు మత్తు పదార్థాలిచ్చి దారుణంగా హింసించి అత్యాచారం చేసిన కేసులో న్యూజెర్సీకి చెందిన అన్నదమ్ములు విల్సన్ సీజర్(21), విల్‌ఫ్రెడ్ సీజర్(28) అరెస్టయ్యారు. మిల్‌స్టోన్ టౌన్‌షిప్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు టీనేజ్ యువతులను జాలీరైడ్ పేరుతో తమ వాహనం ఎక్కించుకున్నారు. అనంతరం వారిని బలవంతంగా తమ అస్పరీ పార్క్ హోమ్‌కి తీసుకెళ్లారు.

Also Read:

అక్కడ యువతులతో గంజాయి తాగించి మత్తులోకి జారుకునేలా చేశారు. ఫుల్లుగా మద్యం తాగించి మత్తులో దారుణానికి ఒడిగట్టారు. నలుగురు యువతుల్లో ముగ్గురిని దారుణంగా రేప్ చేశారు. మత్తులో నుంచి బయటపడిన అనంతరం టీనేజ్ అమ్మాయిలకు విషయం అర్థమైంది. వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో రేపింగ్ బ్రదర్స్‌ని అరెస్టు చేశారు.

మైనర్ బాలికలను కిడ్నాప్.. మత్తు పదార్థాల వినియోగం.. అత్యాచారం తదితర నేరాల కింద అభియోగాలు నమోదు చేశారు. చిన్నారులకు హాని చేయడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. లైంగిక నేరాలకు పాల్పడేవారి జాబితాలో నిందితుల పేర్లు నమోదు చేశారు. రేపింగ్ బ్రదర్స్‌పై నమోదైన అభియోగాలు నిరూపితమైతే జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here