రూ.200 రీఛార్జ్ చేస్తే రూ.64వేలు పోయాయి.. ఫోటోగ్రాఫర్‌ సైబర్ షాక్

లాక్‌డౌన్ సమయంలో ఓ వైపు నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని నివేదికలు చెబుతుంటే.. మరోవైపు సైబర్ నేరాలు మాత్రం గణనీయంగా పెరిగిపోయాయి. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో బాధితులు భారీ సంఖ్యలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాగే ఫోన్‌ రీచార్జ్‌ విషయమై ఎంక్వైరీ చేయడానికి కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా రూ.64వేలు నష్టపోయాయి. దీనిపై బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Also Read:

హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ సోమవారం తన భార్య ఫోన్‌కు గూగుల్‌ పే ద్వారా రూ.200 రీచార్జ్‌ చేశారు. ఎంతసేపటికి రీఛార్జ్ అయినట్లు మెసేజ్ రాకపోవడంతో మంగళవారం ఆ సంస్థను సంప్రదించడానికి గూగుల్ ఫోన్ నంబర్లు వెతికి కాల్ చేశారు. ఆ నంబర్‌ సైబర్‌ నేరగాళ్లది కావడంతో వారు బాధితుడు చెప్పే విషయం మొత్తం విని రెండు లింకులు పంపారు. బాధితుడి ఫోన్‌ నుంచి ఆ లింకులను ఫలానా నంబర్‌కు పంపితే వెంటనే రూ.200 రీచార్జ్‌ అయిపోతుందని చెప్పడంతో అతడు ఆ విధంగానే చేశాడు.

Also Read:

దీంతో అతడి రెండు బ్యాంకు ఖాతాలకు చెందిన యూపీఐ లింకులు సైబర్‌ నేరగాళ్ల ఫోన్‌కు వెళ్లిపోయింది. దీని ద్వారా నాలుగు ట్రాన్సాక్షన్లు చేసిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.64వేలు తమ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. కాసేపటి తర్వాత అకౌంట్లో డబ్బులు మాయమైన సంగతి గమనించిన బాధితుడు వెంటనే సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here