యోగా గురువుల కీచకపర్వం.. జపనీస్ శిష్యురాలితో అసభ్యకరంగా..

మహిళను చూస్తే కామంతో రగిలిపోతున్నారు కొందరు కామాంధులు. ఉచ్ఛం నీచం మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. యోగాభ్యసనకు ఇండియా ఓ మహిళపై ఏకంగా యోగా గురువులే వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా ఉన్న సమయంలో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటచేసుకుంది.

యోగా నేర్చుకునేందుకు ఇండియా వచ్చిన ఓ జపనీస్ మహిళ(27)ను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన రిషికేష్‌లో చోటుచేసుకుంది. యోగాభ్యసన కోసం జపనీస్ మహిళ ఓ యోగా స్కూల్‌లో చేరింది. అందులో పనిచేస్తున్న యోగా గురువులు ఆమెపై కన్నేశారు. ఇద్దరు గురువులు.. స్కూల్‌ సిబ్బంది ఒకరు కలసి జపనీస్ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేశారు.

Also Read:

అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యోగా గురువులతో పాటు ఒక వంటమనిషి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యోగా గురువులు చంద్రకాంత్(32), హరికిషన్‌(43), వంటమనిషి సోమరాజ్(23)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here