యువతితో న్యూడ్ వీడియో కాల్.. రూ.80వేలు సమర్పించుకున్న హైదరాబాద్ టెక్కీ

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త ఎత్తుగడ, కొత్త స్కీమ్‌లతో అమాయకులను మోసం చేస్తూ భారీగా డబ్బులు గుంజుతున్నారు. ఇలాగే ఆన్‌లైన్లో అమ్మాయి మోజులో పడిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిలువునా మోసపోయాడు. హైదరాబాద్‌లో ఉంటున్న సురేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా రూమ్‌లో ఒక్కడే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఖాళీ సమయంలో పోర్న్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేసేవాడు. ఈ క్రమంలోనే ఓ వెబ్‌సైట్లో ఫోన్ నంబర్ కనిపించింది. అందమైన అమ్మాయిలతో సెక్స్ ఛాటింగ్‌, వీడియో కాలింగ్‌, న్యూడ్ ఫొటోల కోసం సంప్రదించాలని అందులో ఉంది.

Also Read:

దీంతో సురేశ్ ఆ నంబర్‌కు కాల్ చేయగా అవతలి వైపు ఓ యువతి ఎత్తింది. వలపు మాటలతో అతడిని ముగ్గులోకి దించింది. కొంత మొత్తం చెల్లించడంతో న్యూడ్ ఫోటోలు పంపించింది. ఆమె అందానికి ఫిదా అయిపోయిన సురేశ్ ఉత్సాహాన్ని ఆపుకోలేక వీడియో కాలింగ్‌లో మాట్లాడాలని కోరాడు. ఆమె సరేననడంతో ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ యువతి బట్టలు లేకుండా కెమెరా ముందుకొచ్చింది. సురేశ్‌ను కూడా అలాగే రావాలని కోరడంతో అతడు కూడా న్యూడ్‌గా మారి ఆమెతో మాట్లాడాడు. ఇలా కొన్నిసార్లు ఇద్దరూ న్యూడ్‌గా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు.

Also Read:

కొద్దిరోజుల తర్వాత సురేశ్‌కు ఓ మెయిల్ వచ్చింది. అందులో అతడు న్యూడ్‌తో వీడియో కాల్ మాట్లాడిన వీడియో ఉంది. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారు. దీంతో భయపడిపోయిన అతడు రూ.20వేలు ఇచ్చాడు. ఇలా విడదల వారీగా రూ.80వేల వరకు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా వారు డబ్బు డిమాండ్ చేయడంతో సురేశ్ స్పందించలేదు. దీంతో న్యూడ్ ఫోటోలను అతడి ఫేస్‌బుక్ అకౌంట్‌కు ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here