యువకుడి వలలో పడిన ఆంటీ.. పెళ్లి పేరుతో లైంగిక కోరికలు తీర్చుకుని

భర్త వేధింపులు భరించలేక అతడితో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైన మహిళ ఓ యువకుడి చేతిలో దారుణంగా మోసపోయిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌‌లో వెలుగులోకి వచ్చింది. నగరంలోని మహమండిర్‌ ప్రాంతానికి చెందిన మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవాలనుకుంది. దీంతో గది అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు రమేశ్ అనే యువకుడు పరిచయమయ్యాడు.

Also Read:

కొద్దిరోజుల తర్వాత అతడితో చనువు ఏర్పడటంతో తన సమస్య గురించి చెప్పుకుంది. దీంతో భర్తతో విడాకులు వచ్చేలా తాను సాయం చేస్తానని నమ్మించిన రమేశ్‌ ఆమెను లైంగికంగా దోచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో రమేశ్‌తో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఆమెకు షాక్ తగిలింది. పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమేశ్ తనను పెళ్లి చేసుకునంటానని నమ్మించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, మోజు తీరాక మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here