యువకుడితో ఆంటీ ఎఫైర్.. భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. చివరికి..

వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా కూలుస్తున్నాయి. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తను వదిలేసి వెళ్లిపోయిన మహిళ చివరికి విగతజీవిగా మారింది. నమ్మివచ్చిన యువకుడు నట్టేట ముంచడంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. చివరికి ఆమె బిడ్డలు అటు తండ్రికి దూరమై.. తల్లి చనిపోయి దిక్కుతోచని స్థితిలో నిలబడాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది.

మండలం కనుమళ్లకు చెందిన సుభాషిణికి నాలుగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడుకి చెందిన హనుమంతురావుతో సుమారు తొమ్మదేళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కూతురు, కొడుకు సంతానం. సుభాషిణి అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల నడుమ వివాదాలు చెలరేగాయి. దీంతో ఆమె భర్తకు దూరంగా ఉంటోంది.

Also Read:

ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనిచేస్తూ అక్కడికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో కలసి నివసిస్తోంది. ప్రియుడు రాజు ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ నెల ఒకటో తేదీన కూడా వచ్చి వెళ్లాడు. ఆ తరువాత రాజు ఇంటికి రాకపోవడంతో సుభాషిణి మనస్థాపానికి గురైంది. ప్రియుడు మళ్లీ కనిపించకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రేకుల షెడ్డుకు ఉన్న ఇనుప రాడ్డుకు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఆమె ఆత్మహత్యకు పాల్పడే సమయంలో ఆమె చిన్నారి కూతురు వద్దు.. వద్దు.. అంటూ తల్లిని బతిమిలాడినట్లు తెలుస్తోంది. లోకం తెలియని కొడుకు కూడా ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరు పిల్లల ముందే తల్లి ఉరేసుకుని చనిపోవడం స్థానికులను కలచివేసింది. చిన్నారులు ఇంటి యజమానికి విషయం చెప్పడంతో వారు వచ్చేలోపే ఆమె చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here