మందుబాబులకు గుడ్ న్యూస్.. గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం ఓకే.. నిబంధనలు ఇవే

దేశవ్యాప్తంగా విధించిన గడువును కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించింది. దీంతో మే 17 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. రెడ్ జోన్లలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు కానుండగా.. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా మందుబాబులకు కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. గ్రీన్ జోన్ల పరిధిలోని పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

మద్యం అమ్మకాలకు కేంద్రం నిబంధనలను విధించింది. షాపుల దగ్గర ఐదుగురి కంటే ఎక్కువగా ఉండొద్దని.. ఒక్కొక్కరి మధ్య రెండు గజాల దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రాగా.. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. మద్యం దొరక్కపోవడంతో చాలా మంది మానసిక సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరైతే అసలు ధరకు నాలుగింతలు ఎక్కువ ఖర్చు పెట్టి బ్లాక్‌లో మద్యాన్ని కొనుగోలు చేశారు. ఎక్కువ ధర పెట్టినా మద్యం దొరక్కపోవడంతో కల్లు, నాటుసారాల వైపు కూడా కొందరు మందుబాబులు మళ్లారు. కేరళ లాంటి రాష్ట్రాలు పరిమితంగా మద్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా.. న్యాయస్థానాలు, కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలు చేపట్టొద్దని రాష్ట్రాలకు సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here