భార్యని హింసిస్తూ ఆమె అన్నకి వీడియో కాల్.. సడెన్‌గా పోలీసుల ఎంట్రీ.. ఏమైందంటే..

మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్లలో భయం కలగడం లేదు. మహిళలపై వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. భార్యపై అనుమానంతో తీవ్రంగా కొట్టడమే కాకుండా.. ఆ ఘటనను వీడియో కాల్‌లో ఆమె సోదరుడికి చూపిస్తూ హింసించిన ఘటన తాజాగా ముంబైలో వెలుగుచూసింది. తీరా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అనుమానపు భర్త అవాక్కయ్యాడు. భార్యని హింసిస్తున్న భర్తని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని అజాంగఢ్‌కి చెందిన నీలేష్ ఉపాధ్యాయ వడాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్భావన నగర్‌లో భార్య, కొడుకు, తల్లిదండ్రులతో కలసి నివాసం ఉంటున్నాడు. ఇటీవలో నీలేష్ పేరెంట్స్ యూపీ వెళ్లారు. భార్య లక్ష్మి, కొడుకుతో కలసి ఉంటున్నాడు. కార్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న నీలేష్ కొద్దికాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తున్నాడు.

Also Read:

ఓ రోజు రాత్రి భార్య తన ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా నీలేష్ చూశాడు. ఎవరితో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగాడు. తన ఫ్రెండ్ ఆషాతో మాట్లాడుతున్నానని చెప్పినా వినిపించుకోకుండా దాడికి దిగాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి వీడియో కాల్ చేసి చీపురుతో తీవ్రంగా కొడుతూ హింసించాడు.

ఈలోగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. వీడియో కాల్‌లో సోదరిని కొట్టి హింసిస్తున్న బావని చూసి ఆగ్రహం చెందిన ఆమె సోదరుడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు నీలేష్ ఇంటికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here