భారత్‌కు మరోసారి అమెరికా సాయం.. కరోనాపై పోరుకు మరో 3 మిలియన్ డాలర్లు

మహమ్మారిపై భారత్ పోరాటానికి అమెరికా ఇప్పటికే భారీ సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌కు 2.9 మిలియన్‍ డాలర్లు ఇవ్వనున్నట్టు ఏప్రిల్ 6న అగ్రరాజ్యం వెల్లడించింది. యూఎస్‍ ఏజెన్సీ ఫర్‍ ఇంటర్నేషనల్‍ డెవలప్‍మెంట్‍ (యూఎస్‍ఏఐడీ) ద్వారా ఈ ఆర్థిక సహకారం అందజేస్తున్నట్టు తెలిపింది. తాజాగా, మరో 3 మిలియన్ డాలర్లు సాయం చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఏప్రిల్ 6 ప్రకటించిన 2.9 మిలియన్ డాలర్లకు ఇది అదనం. దీంతో కరోనా వైరస్‌పై పోరుకు మొత్తం 5.9 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించినట్టుయ్యింది.

ఈ మేరకు భారత్‍లో అమెరికా రాయబారి కెన్నెత్‍ జస్టర్‍ ఓ ప్రకనట చేశారు. కరోనా వైరస్‌తో భారత్ మరింత సమర్థంగా పోరాడేందుకు ఈ ఆర్ధిక సాయం ఉపయోగపడుతుందని ఆయన కెన్నెత్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఇది భారత్, అమెరికాల మధ్య ఉన్న బలమైన మైత్రికి మరో ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిధులను పార్ట్‌నర్‌షిప్ ఫర్ అఫర్డ్‌బుల్ హెల్త్‌కేర్ యాక్సెస్ అండ్ లాంగెవిటీ (పహల్) ప్రాజెక్టు కింద అందజేస్తున్నట్టు అమెరికా రాయబారి వివరించారు.

భారత్‌లో కోవిడ్ -19 వ్యాప్తి కట్టడి, బాధితులకు రక్షణ కల్పించడానికి, సమాజాని అవసరమైన ప్రజారోగ్య సేవలను విస్తరించడానికి, పాజిటివ్ కేసుల గుర్తింపు, నిఘాను బలోపేతం చేయడానికి ఈ సాయం సహాయపడుతుంది. పహల్ ప్రాజెక్ట్ ద్వారా జాతీయ ఆరోగ్య అథారిటీకి ప్రైవేటు రంగం నుంచి వనరులను సమీకరించగల ఫైనాన్సింగ్ సదుపాయాన్ని యూఎస్ఏఐడీ ఏర్పాటు చేస్తుంది. భారత్‌లో ఆరోగ్య భీమా పథకం ప్రధాన మంత్రి జాన్ ఆరోగ్య యోజన (PM-JAY) కింద 500 మిలియన్ల పేదలకు 20,000 ఆరోగ్య సౌకర్యాలకు సహాయం చేస్తుంది.

కరోనా మహమ్మారిని తిప్పికొట్టేందుకు సెంటర్‍ ఫర్‍ డిసీజ్‍ కంట్రోల్‍ అండ్‍ ప్రివెన్షన్‍ (సీడీసీ), యూఎస్‍ఏఐడీ వంటి సంస్థలు భారత్‍తో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ‘ యాక్షన్ ప్లాన్’ కింద‌ 64 దేశాలకు అమెరికా మొత్తం 174 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో 2.9 మిలియన్ డాలర్లు భారత్‌కు అందుతాయి. యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఏఐడీ) ద్వారా వీటిని అందజేయనుంది. గత 20 ఏళ్లలో భారత్‌కు తాము అందజేసిన ఆరోగ్య సాయంతో పోల్చితే ఇదే అత్యధికమని, దీంతో తమ మొత్తం సాయం 3 బిలియన్‌ డాలర్లకు చేరిందని అమెరికా వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here