భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి రివెంజ్ డ్రామా చూసి ఉండరు…!

ఈ రోజుల్లో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు.. అవకాశం వచ్చింది కదా అని తొక్కేయ్యప్రయత్నించ కూడదు.. ఆ రోజులు అయిపోయాయి! అదేసమయంలో.. ఎప్పుడూ మనమే తోపులమని అనుకున్నా పర్లేదు కానీ.. అవతలి వ్యక్తి తోపు కాదు, కాలేడు అని అస్సలు అనుకోకూడదు. ఇప్పుడు ఈ ఉపోధ్గాతం అంతా ఎందుకంటే… సోనియా – జగన్ ల గురించి!!

పిల్లోడు పిల్లోడిలా ఉండకుండా.. ఈ సొంత పెత్తనాలు ఏమిటి? అధిష్టాణాన్ని దిక్కరించే స్థాయికి వచ్చేశాడా అప్పుడే? ఎంపీ అయ్యి మూడు నెలలు కాలేదు.. ఏమనుకుంటున్నాడు? ఒకాకొన సమయంలో సోనియా గాంధీ.. జగన్ గురించి ఇలా భావించి ఉండవచ్చు. చెప్పుడుమాటల ఫలితమో ఎమోకానీ పదేళ్ళ క్రితం జగన్ మీద ఆమె అంచనా అంతే. అనంతరం జగన్ కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసి.. అయిదున్నర లక్షల మెజారిటీతో కడప ఉప ఎన్నికల్లో గెలిచాడు. అప్పటికే సోనియాకు జగన్ పై ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.

అనంతరం ప్రతిపక్ష హోదా.. తాజాగా ముఖ్యమంత్రి! పైగా ఏమాత్రం అనుభవం లేనివాడుగా చూపించే ప్రయత్నం చేసినా.. అది ఎక్కడా కనిపించకుండా హాయిగా పాలించుకుంటూపోతున్నాడు జగన్. ఈ పాలనపైనే తాజాగా కన్నడ కాంగ్రెస్ నేత, సీనియర్ మోస్ట్ లీడర్ సిధ్ధరామయ్య ప్రశంసల వర్షాలు కురిపించారు. కరోనా సమయంలో జగన్ చూపించిన తెగువ, చాకచక్యం, తీసుకున్న నిర్ణయాలు మాములువి కావంటూ ఆకశానికి ఎత్తేస్తున్నారు. జగన్ ని చూసి అయినా నేర్చుకోవయ్యా అంటూ ఏకంగా కన్నడ సీఎం యడ్యూరప్పను దెప్పిపొడుస్తున్నాడు.

జగన్ కి ఇంతకు మించిన విజయం ఉంటుందా అంటున్నారు విశ్లేషకులు. సోనియా గాంధీకి అత్యంత దగ్గరైన వ్యక్తి.. సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడరు… సోనియా వద్దనుకున్న వ్యక్తిని ఆకాశానికి ఎత్తేస్తుంటే… ఆ మాటలు చాలవా.. సోనియాకు జగనంటేంటో తెలిసొచ్చిందని చెప్పడానికి… ఆ మాటలు చాలవా.. జగన్, సోనియా దగ్గర కాలర్ ఎగరేయడానికి! ఆ మాటలు చాలవా… సోనియా నాడు ఎంత తప్పు చేసిందో తెలుసుకోడానికి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here