భర్త శవం 3 రోజులుగా ఇంట్లోనే.. నిజామాబాద్‌లో వీఆర్వో భార్య దారుణం

నిజామాబాద్ నగరంలో అత్యంత దారుమైన ఘటన చోటు చేసుకుంది. నగరంలోని న్యూ హౌసింగ్ కాలనీలో ఓ ఇంట్లో భర్త శవాన్ని మూడు రోజులుగా భార్య ఇంట్లోనే ఉంచుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అంతేకాక, భర్త రక్తపు మడుగులో పడి ఉండడం గమనార్హం. మృతుడి భార్యకు మతి స్తిమితం లేనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శకుంతల, లింబా రెడ్డి దంపతులు న్యూ హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం పాలు పోసే వ్యక్తి ఎప్పటిలాగే ఆ ఇంటికి వెళ్లగా.. మృతుడి భార్య పాలు పోయించుకుంది. తర్వాత అతనితో తన భర్త చనిపోయాడనే విషయం చెప్పింది. ఆ శవాన్ని తీసుకెళ్లాలని పాలు పోసే వ్యక్తిని కోరినట్లుగా పోలీసులు తెలిపారు.

నిజంగానే ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో వెంటనే కంగు తిన్న పాలు పోసే వ్యక్తి ఆందోళనతో స్థానికులకు ఈ విషయం చెప్పాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. వారు లోపలికి వెళ్ళే సరికి రక్తపు మడుగులో లింబా రెడ్డి మృతదేహం పడి ఉంది. ఆ పక్కనే శకుంతల కూర్చుని ఉంది. అయితే శకుంతల మతిస్థిమితం కోల్పోయి ఉంటుందని ఆమెనే భర్తను చంపి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

Also Read:

మూడు రోజుల క్రితం చనిపోయి ఉండడంతో మృత దేహం కుళ్ళిపోయి ఉంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి శవాగారానికి తరలించారు. దంపతుల కుమారుడు ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాదులో నివసిస్తుంటాడని, కుమార్తె లండన్‌లో స్థిరపడిందని స్థానికులు చెబుతున్నారు. ఆ ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారని చెప్పారు. లింబా రెడ్డి వీఆర్వోగా పనిచేసినట్లుగా స్థానికులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here