భర్తను చంపేసి హైడ్రామా.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ నిజాలు.. నాగర్ కర్నూల్‌లో దారుణం

నిత్యం భర్త వేధింపులు భరించలేక దారుణంగా చంపేసిందో భార్య. కత్తితో గొంతుకోసి కిరాతకంగా హత్య చేసి హైడ్రామాకు తెరతీసింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఇరుగుపొరుగును నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను భార్యే కిరాతకంగా చంపేసినట్లు తేలింది. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

బిజినేపల్లి మండలం మంగనూరుకు చెందిన శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచూ భార్యను హింసిస్తుండేవాడు. ప్రతిరోజూ భర్త వేధింపులు భరించలేకపోయిన భార్య.. భర్తను అంమొందించాలని నిర్ణయించుకుంది. మద్యం మత్తులో ఆరుబయట ఆదమరచి నిద్రిస్తున్న భర్తను దారుణంగా హత్య చేసింది. కత్తితో గొంతుకోసం కిరాతకంగా చంపేసింది.

Also Read:

భర్తను చంపేసి హైడ్రామాకు తెరతీసింది. గొంతుకోసిన కత్తిని మృతుడి చేతిలో పెట్టి మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని నమ్మించేందుకు యత్నించింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్యను తమ స్టైల్లో విచారించడంతో తానే హత్య చేసి కత్తి చేతిలో పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here