బీరు బాటిల్‌తో తలపై కొట్టి బాలికపై అఘాయిత్యం..మండపేటలో దారుణం

జిల్లా మండలం తాపేశ్వరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించడం స్ధానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక మండపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతూ ఇటీవలే పరీక్షలు రాసింది. సెలవులు కావడంతో ఇంటి దగ్గరే ఉంటోంది. ఐదురోజుల క్రితం తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో పాతపేటకు చెందిన ఖండవల్లి భాగ్యరాజ్ అలియాస్ పండు అనే యువకుడు వచ్చి మంచినీళ్లు కావాలని అడిగాడు. యువతి నీళ్లు ఇచ్చేందుకు లోపలికి వెళ్లగా వెనకాలే వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

Also Read:

ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో ఆమె భాగ్యరాజ్‌ను నిలదీసింది. నీకు నా కూతురే కావాల్సి వచ్చిందా? మరోసారి ఇలా చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. దీంతో కక్ష పెంచుకున్న భాగ్యరాజ్ మంగళవారం ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు. గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. బాలిక తప్పించుకుని పారిపోతుండగా మద్యం సీసాతో తలపై కొట్టాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు.

Also Read:

దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, రూరల్ సీఐ కె. మంగదేవి అక్కడికి చేరుకుని ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బాలిక కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితుడిపై ఐపీసీ 376 సెక్షన్‌తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మండపేట ఎస్ఐ దొరరాజు తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here