బావతో కలసిపోయిన అక్క.. కక్ష తీర్చుకున్న తమ్ముడు

విభేదాలతో విడిపోయిన అక్క, బావ ఫ్యామిలీ కోర్టు సూచనలతో మళ్లీ ఒక్కటై కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఎలాగైతేనేం అక్క కాపురం బాగుపడిందని సంతోషించాల్సింది పోయి పగతో రగిలిపోయాడు ఆమె తమ్ముడు. ఏకంగా అక్క అత్తమామాలను అంతమొందించాడు. ఇద్దరినీ కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రాజధాని బెంగళూరులో జరిగింది.

నగరంలోని అవనహళ్లి ప్రాంతానికి చెందిన రాకేష్(25) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు. అతని అక్క పవిత్రని ఆర్బీఐ లేఔట్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నవీన్‌తో 2008లో వివాహమైంది. కొన్నేళ్లుగా సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగడంతో ఇద్దరూ విడిపోయారు. భార్యాభర్తలు కోర్టును ఆశ్రయించడంతో ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ ఇచ్చింది. దీంతో భార్యాభర్తలిద్దరూ పాత గొడవలు మర్చిపోయి గతేడాది ఒక్కటయ్యారు.

Also Read:

అయితే అక్కాబావ కలిసిపోవడం ఆమె తమ్ముడు రాకేష్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. అప్పటికే ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్న రాకేష్.. అక్క అత్తమామలు గోవిందయ్య(65), శాంతమ్మ(58)ని దారుణంగా చంపేశాడు. గోవిందయ్య రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి కాగా ఆయన భార్య గృహిణి. రాత్రి 9 గంటల సమయంలో ఇంటికొచ్చిన కొడుకు నవీన్.. విగతజీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here