బంధువుతో మహిళ అఫైర్.. బెడ్రూమ్‌లో ఉండగా సడెన్ ఎంట్రీ ఇచ్చిన భర్త

జిల్లా దేవనకొండ మండలంలోని కుంకనూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి యువకుడి మర్డర్ మిస్టరీ కొలిక్కి వచ్చింది. తన భార్యతో పెట్టుకున్నాడన్న కోపంతో ప్రియురాలి భర్తే అతడిని కిరాకతంగా చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే… ఎమ్మిగనూరుకు చెందిన ఓ మహిళకు కుంకనూరుకు చెందిన బెస్త బాలరాజుతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామానికి చెందిన బెస్త బడెసాబ్‌(32) అనే వ్యక్తికి కూడా కుంకనూరుకు చెందిన మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. దాంతో అతను తరచూ అత్తగారి గ్రామమైన కుంకనూరుకు వచ్చి వెళ్లేవాడు.

Also Read:

బడెసాబ్‌‌కు బాలరాజు భార్య దూరపు బంధువు. దీంతో అతడు అత్తగారింటికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంటికి కూడా వెళ్లి పలకరిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చనువు ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. సుమారు ఐదేళ్లుగా వీరి మధ్య అఫైర్ కొనసాగుతోంది. బాలరాజు బయటకు వెళ్లినప్పుడల్లా ఆమె ప్రియుడికి కబురు పెట్టేది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి బాలరాజు కరివేముల గ్రామంలోని చెరువుల్లో చేపలు పట్టేందుకు వెళ్లిన కూలీలకు భోజనం తీసుకెళ్లాడు. తాను వచ్చేటప్పటికి తెల్లవారుతుందని, జాగ్రత్తగా ఉండాలని భార్యకు చెప్పి వెళ్లాడు.

Also Read:

భర్త లేకపోవడంతో ఆ మహిళ వెంటనే ప్రియుడు బడెసాబ్‌‌కు ఫోన్ చేసింది. దీంతో అతడు కొద్ది క్షణాల్లోనే ప్రియురాలి చెంతకు చేరిపోయాడు. ఇద్దరూ కలిసి బెడ్రూమ్‌లోకి వెళ్లి రాసలీలలు మొదలుపెట్టారు. అయితే చెరువు వద్ద పని త్వరగా పూర్తికావడంతో బాలరాజు ఇంటికి వచ్చేశాడు. ఈ సమయంలో తన భార్య, బడెసాబ్‌‌తో నగ్నంగా అసభ్యకర రీతిలో ఉండటాన్ని కళ్లారా చూసిన అతడు ఆవేశం పట్టలేకపోయాడు. ఇంటి నుంచి బయటకు పారిపోతున్న బడెసాబ్‌ తల, మెడపై కత్తిపీటతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో బడెసాబ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి గురువారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. తన కొడుకును బాలరాజు, అతడి భార్య ప్లాన్ ప్రకారమే ఇంటికి రప్పించి హత్య చేశారని బడెసాబ్‌ తండ్రి బెస్త రాముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బాలరాజు, అతడి భార్యతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here