ఫ్రెండ్స్‌తో కలిసి భార్యపైనే గ్యాంగ్ రేప్.. డబ్బుల కోసం నీచానికి పాల్పడిన భర్త

జీవితాంతం తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. జూదంలో ఓడిపోయి స్నేహితులతో కలిసి భార్యపైనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. హర్యానాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన నిందితుడు రూపేశ్(పేరు మార్చాం) భార్య, పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. తాగుడు, జూదానికి బానిసైన రూపేశ్ నిత్యం భార్యను వేధింపులకు గురిచేసేవాడు.

Also Read:

ఈ క్రమంలోనే జూదానికి డబ్బులు లేక తన స్నేహితుల లైంగిక కోరికలు తీర్చాలంటూ భార్యను వేధించేవాడు. తాను అలాంటి దానిని కాదని, కావాలంటూ తానే ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తానని ఆమె భర్తకు నచ్చజెప్పేది. అయినా వినిపించుకోని తన ఫ్రెండ్స్‌తో వ్యభిచారం చేయాలని వేధించేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటికొచ్చిన రూపేశ్ భార్య కాళ్లు చేతులు కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తన భార్యతో సుఖం పొందినందుకు వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు.

Also Read:

తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాధితురాలు ఎవరికీ చెప్పుకోకుండా తనలో తానే కుమిలిపోయింది. ఆమె పరిస్థితి చుట్టుపక్కల వాళ్లు ఆరా తీయగా అసలు నిజం చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా రూపేశ్‌తో పాటు అతడి స్నేహితులపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here