ఫ్యాక్ట్‌చెక్‌: కరోనా చికిత్సలో హోమియోపతి వాడకానికి అనుమతి..?

క‌రోనా వైర‌స్ చికిత్స‌పై చాలా ప్రచారం జ‌రుగుతోంది. సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల‌తోపాటు ఆయుష్ మందుల‌ను వాడి క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా దీని‌పై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ స్ప‌ష్ట‌త‌నిచ్చింది. క‌రోనా చికిత్స‌లో హోమియోప‌తి మందుల‌ను వాడటానికి అనుమ‌తి లభించిందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం స‌రైంది కాద‌ని ట్వీట్ చేసింది. కరోనాపై పోరులో ఆయుష్ పాత్ర‌ను అంచ‌నా వేసేందుకు మాత్ర‌మే చిన్న‌పాటి రీసెర్చ్ జ‌రుగుతోంద‌ని తెలిపింది. రీసెర్చీ కోసమే హోమియోపతిని‌ వాడుతున్నామ‌ని, ఈ మందుల‌తో కరోనా పేషంట్ల‌కు చికిత్స అందించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Must Read:

మ‌రోవైపు క‌రోనా కేసుల‌ను ట్రీట్ చేస్తున్న ఆస్ప‌త్రుల‌లో ఈ రీసెర్చ్ చేస్తున్న‌ట్లు కేంద్రం పేర్కొంది. మ‌రోవైపు ఇందులో పాల్గొనేవారికి క్వారంటైన్ లేదా క్లినిక‌ల్ మేనేజ్‌మెంట్లో అనుభ‌వం ఉండాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని తెలిపింది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌న‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 27,400కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 870మందికిపైగ మ‌ర‌ణించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 1180కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here