ఫోన్ ఎత్తలేదని భార్యని గొడ్డలితో నరికి.. కడపలో దారుణం

ఫోన్ ఎత్తలేదనే చిన్న కారణంతో భార్యని గొడ్డలితో నరికేశాడో కసాయి భర్త. మద్యం మత్తులో భార్యతో ఉన్మాదిగా మారిన భర్త ఫోన్ ఎందుకు తీయలేదంటూ గొడవపడి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ అమానుష ఘటన జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.

జిల్లాకు చెందిన గిరిజన దంపతులు పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లెలోని మామిడితోటలకు కాపలా ఉంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన మద్యం షాపులు తెరవడంతో భర్త గంటలకొద్దీ క్యూ లైన్‌లో నిల్చుని మద్యం కొనుగోలు చేశాడు. అర్ధరాత్రి వరకూ మద్యం తాగి ఎంజాయ్ చేశాడు.

Also Read:

ఫుల్లుగా తాగేసి మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగాడు. ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదంటూ గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్యకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here