ప్రేమ పేరుతో లైంగిక దాడి.. గర్భవతిని చేసి సంబంధం లేదన్నాడు

ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. మాయమాటలతో పెళ్లికి ముందే ఆమెతో శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో నీకు నాకు సంబంధం లేదన్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందిన ఓ యువతి ఆటోనగర్‌ సమీపంలోని ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. ఇదే ఆసుపత్రిలో కంకిపాడు మండలం గొడవర్రుకు చెందిన వెంట్రప్రగడ మృధుకిరణ్‌ అనే యువకుడు పనిచేస్తున్నాడు. సహోద్యోగులు కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది.

Also Read:

పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొద్దినెలల క్రితం చోడవరం సమీపంలోని పంట పొలాల వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని యువతి పెద్దమనుషుల ద్వారా అతడిని సంప్రదించింది. లాక్‌డౌన్ పూర్తికాగానే పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో నమ్మింది. కొద్దిరోజుల క్రితం యువతి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Also Read:

అబార్షన్ చేయకపోతే యువతి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. దీంతో ఆమె తరఫు పెద్దలు మరోసారి మృధుకిరణ్‌ను సంప్రదించి వివాహం చేసుకోవాలని కోరగా అతడు నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆదివారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here