ప్రియుడితో బెడ్రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన భార్య.. గది బయట గడియ పెట్టి..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పడక సుఖం కోసం పక్కదారి పట్టింది. మరొకరితో పెట్టుకుని భర్తకి తెలియకుండా రాసలీలలు సాగించింది. అది కాస్త బంధువల కంట పడడంతో అడ్డంగా దొరికిపోయింది. ఆ మరుసటి రోజే ఆమె అదృశ్యమై కరోనా ఆస్పత్రిలో ప్రత్యక్షమైంది. చివరకు ఊరిచివర శవమై తేలింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని తలైయుత్తు పరిధి కురిచ్చికులం గ్రామానికి చెందిన సొరిముత్తు(32) భవన నిర్మాణ కూలీ. గతంలో కేరళలో పనిచేకస్తున్న సమయంలో రామలత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం భార్యతో కలసి స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే రామలత కొద్దికాలంగా అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో రాసలీలలు ప్రియుడితో సాగించేది.

Also Read:

రామలత ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు యువకుడితో బెడ్రూమ్‌లో రాసలీలలు సాగిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గది బయట గడియ పెట్టి భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పారు. సడెన్‌గా ఆ మరుసటి రోజే ఆమె కనిపించకుండా పోయింది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ కూడా నమోదైంది.

అయితే భార్యకి ఫోన్ చేసిన సొరిముత్తు తిరునల్వేలిలో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ భార్య రామలతను కలిసిని ముత్తు ఆమెతో కలసి రాత్రి 12.30 గంటల సమయంలో స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గం మధ్యలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. మెడపై పదునైన ఆయుధంతో నరికి కిరాతకంగా చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here