ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలకు చేరువలో కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా విజృంభణ కొనసాగుతుండగా.. దీని బారినపడి దాదాపు రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక బాధిత దేశాలు సతమతవుతున్నాయి. అయితే, ఇప్పటి వరకూ విలయతాండవం చేసిన అమెరికా సహా ఐరోపాలోని స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లో మహమ్మారి కొంత శాంతించింది. మరణాలు, కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించారు. ఇన్నాళ్లూ నిర్బంధంలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.

ఆంక్షలు సడలించడంతో మళ్లీ వైరస్ తీవ్రత పెరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ కేసులు లక్ష దాటడానికి 67 రోజు పడితే, రెండో లక్ష 11 రోజుల్లోనూ, మూడో లక్ష నాలుగు రోజుల్లోనే చేరింది. ప్రస్తుతం రోజుకు సగటున లక్ష మంది వైరస్ బారినపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 35.66 లక్షల మంది కరోనా వైరస్ బారినపడగా… వీరిలో 248,286 మంది చనిపోయారు. అలాగే, వైరస్ నిర్ధారణ అయినవారిలో 1,154,057 మంది కోలుకున్నారు. మరో 21 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 50,00 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బాధితులు, మరణాలు అమెరికాలోనే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 12 లక్షల మంది వైరస్ బారినపడిగా.. 68,598 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా చేతిలో కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాలో దీనిపై ముమ్మర స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని.. ఇంకే దేశమైనా తమకంటే ముందే తయారు చేస్తే ఇంకా మంచిదని అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు.

ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్‌లో కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఇన్నాళ్లూ రోజుకు సగటున 700 వరకు మరణాలు నమోదు కాగా.. గత వారం రోజులుగా 200లోపు నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. స్పెయిన్‌లో మార్చి 14 నుంచి అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలు పాక్షికంగా సడలించారు. ఇటలీలోనూ నేటి నుంచి పార్క్‌లు తెరుచుకోనున్నాయి.

రష్యాలో ఆదివారం ఒక్కరోజే 10,633 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో సగానికిపైగా మాస్కోలోనివే. కేసులు వేగంగా పెరుగుతుండటంతో మాస్కోలో క్రీడా సముదాయాలు, షాపింగ్‌ మాళ్లను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రష్యాలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 134,687కి చేరింది. జర్మనీలో కొత్తగా 793 మందిలో వైరస్‌ నిర్ధారణ కాగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 60వేలు దాటింది. సింగపూర్‌లో తాజాగా 657 కేసులు వెలుగుచూశాయి. అక్కడ మొత్తం కేసులు సంఖ్య 18 వేలు దాటింది.

పాకిస్థాన్‌లో 24 గంటల వ్యవధిలో 989 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేపాల్‌లో కొత్తగా 10 మందికి వైరస్‌ సోకింది. బంగ్లాదేశ్‌లో 24 గంటల వ్యవధిలో 665 కేసులు నమోదయ్యాయి. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో 500 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 156 మంది పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌కు మూలకేంద్రమైన చైనాలోని హుబే ప్రావిన్సుల్లో గత 29 రోజులుగా ఒక్క కొత్త కేసు నమోదు కాలేదు.

ఇటలీతోపాటు దానికి స్పెయిన్, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లో కరోనా ఉద్ధృతి తగ్గింది. ఇప్పటి వరకు స్పెయిన్‌లో 25,264 మంది, ఇటలీలో 28,884 మంది, బ్రిటన్‌లో 28,446, ఫ్రాన్స్ 24,895 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశాల్లో పాజిటివ్ కేసులు లక్షల్లోనే నమోదయ్యాయి. జర్మనీలో 165,665 పైగా కేసులు నమోదు కాగా, 6,886 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో 6,200 మంది, నెదర్లాండ్‌లో 5,056 మంది, స్విట్జర్లాండ్‌లో 1,764 మంది, బెల్జియంలో 7,844 మంది చనిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here