పేకాటలో భార్యని తాకట్టుపెట్టిన భర్త.. ఓడిపోవడంతో..

జూదం మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందనడానికి నిదర్శనంగా నిలుస్తోందీ ఘటన. పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న భర్త ఏకంగా భార్య శీలాన్ని తాకట్టుపెట్టిన దారుణ ఘటన వెలుగుచూసింది. చివరకి అతను పేకాటలో ఓడిపోవడంతో దారుణానికి ఒడిగట్టారు అతని స్నేహితులు. ఈ అమానుష ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉంటున్న ఓ ప్రబుద్ధుడు స్నేహితులతో పేకాట ఆడడం మొదలుపెట్టాడు. ముగ్గురు స్నేహితులతో పేకాట ఆడుతుండగా అతని జేబులో డబ్బులు అయిపోవడంతో ఏకంగా భార్యని జూదంలో తాకట్టుపెట్టాడు. ఓడిపోతే భార్యను అప్పజెబుతానని పందెం కాశాడు. తీరా ఆటలో ఓడిపోవడంతో అతని స్నేహితులు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు.

Also Read:

భరించలేకపోయిన భార్య పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. తన భర్త జూదంలో తాకట్టు పెట్టి ఓడిపోవడంతో అతని స్నేహితులు లైంగిక వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేసింది. తన భర్త ఇంట్లోనే స్నేహితులతో పేకాట ఆడడంతో పాటు గంజాయి తాడేవాడని పేర్కొంది. తన స్నేహితుల కామకోరికలు తీర్చాలంటూ హింసించేవాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here