పిల్లాడిని రేప్ చేసిన యువకుడు.. గొంతు నులిమి, నిప్పుపెట్టి దారుణం

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత హేయమైన, దారుణమైన ఓ ఘటన జరిగింది. ఓ 22 ఏళ్ల యువకుడు 10 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక, అతణ్ని చంపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో సల్మాన్ అనే 22 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటికి పొరుగున ఉండే ఓ బాలుడ్ని నమ్మించి, ఆడుకుందామని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.

అక్కడ పదేళ్ల బాలుడిపై ఆ వ్యక్తి అస‌హ‌జ‌ లైంగిక క్రీడకు పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో భ‌య‌ప‌డిపోయిన బాలుడు తనను కాపాడాలని పెద్దగా కేకలు వేశాడు. దీంతో నిందితుడు ఆందోళన పడిపోయి బాలుడి గొంతు పిసికేశాడు. ఫలితంగా బాలుడు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయాడు. బాలుడు చ‌నిపోయాడ‌ని అనుకున్న నిందితుడు శవాన్ని త‌గల‌బెట్టాల‌నే ఉద్దేశంతో సమీప పొదలకు నిప్పంటించాడు. ఈ బాలుడ్ని అందులో ఉంచి పారిపోయాడు.

ఆ మంటలకు స్పృహ‌లోకి వ‌చ్చిన బాలుడు సాయం కోసం గట్టిగా అరవ‌డంతో రోడ్డుపై వెళ్తున్న వారు గ‌మ‌నించి స్థానికుల సాయంతో మంటలను ఆర్పారు. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని గురువారం నిందితుడిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here