నేరుగా ఇంటికే మద్యం.. ప్రభుత్వ సంచలన నిర్ణయం

సుమారు 40 రోజుల లాక్‌డౌన్ అనంతరం షాపులు ఒక్కసారిగా తెరుచుకోవడంతో మందుబాబులు కిలోమీటర్ల మేర బారులుతీరారు. దాదాపుగా మద్యం విక్రయాలు ప్రారంభించిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మద్యం షాపుల వద్ద గుంపులు గుంపులుగా మద్యం ప్రియులు నిల్చోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సామాజిక దూరం పాటించేలా కనీస చర్యలు చేపట్టకుండా మద్యం విక్రయాలు జరపడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రీన్‌ జోన్ల పరిధిలో ఆన్‌లైన్ ద్వారా మద్యం విక్రయాలు చేపట్టాలని.. మద్యాన్ని నేరుగా హోం డెలివరీ చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆ పోర్టల్ ద్వారా మద్యం ఆర్డర్ చేసి ఆన్‌లై‌న్‌లో నగదు చెల్లిస్తే నేరుగా మద్యాన్ని ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు.

Also Read:

మద్యం విక్రయాల కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సీఎస్‌ఎంసీఎల్ ఆన్‌లైన్’ పేరుతో మొబైల్ యాప్‌‌‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆన్‌లైన్ ఒక్కొక్కొరు గరిష్టంగా 5000 మి.లీ (5 లీటర్ల) మద్యాన్ని ఆర్డర్ చేయొచ్చు. డెలివరీ చార్జీల కింద మద్యం ధరకు అదనంగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్ చేసి నగదు చెల్లించిన వెంటనే మద్యం ఇంటికే డెలివరీ చేస్తారు. స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

అయితే నేరుగా ఇంటికే మద్యాన్ని డెలివరీ చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మద్యనిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. లిక్కర్ హోం డెలివరీ ప్రవేశపెట్టడం దారుణమని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని ఛత్తీస్‌గఢ్ ప్రతిపక్ష నేత ధరమ్‌లాల్ కౌషిక్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here