నేను ఆరోగ్యంగానే ఉన్నా.. అవన్నీ వదంతులే: అమిత్ షా

తన ఆరోగ్యం బాగోలేదని వస్తోన్న వదంతుల పట్ల కేంద్ర హోం మంత్రి స్పందించారు. ఆరోగ్యంగానే ఉన్నానని, పూర్తి అంకితభావంతో తన విధులను నిర్వర్తిస్తున్నానని అమిత్ షా తెలిపారు. ‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, ఏ జబ్బుతోనూ బాధపడటం లేదు’ అని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. దేశం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. తన పనిలో తాను నిమగ్నమై ఉన్నానని.. తన ఆరోగ్యంగా వస్తోన్న రూమర్లను పట్టించుకోలేదన్నారు.

‘నా ఆరోగ్యం బాగోలేదని వదంతులు నా దృష్టికి వచ్చినప్పుడు.. అలాంటి రూమర్లను వ్యాపింపజేసే వాళ్లు ఎంజాయ్ చేయాలని భావించాను. అందుకే ఇంతకు ముందు ఈ విషయమై వివరణ ఇవ్వలేదు’ అని షా తెలిపారు. కానీ లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందే ప్రమాదం ఉండటంతో రూమర్ల గురించి స్పందించాల్సి వచ్చిందన్నారు.

హిందువుల నమ్మకం ప్రకారం ఆరోగ్యం బాగోలేదనే వదంతుల మరింత ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయని అమిత్ షా తెలిపారు. ‘కాబట్టి ఇకనైనా నా ఆరోగ్యం గురించి రూమర్లు ప్రచారం చేయకుండా.. నా పని నన్ను చేసుకొనిస్తారని భావిస్తున్నా’ అని బీజేపీ అగ్రనేత ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here