‘నా ఆస్తి మొత్తం తీసుకో.. నీ భర్తని నాకిచ్చెయ్..’ లేడీ ఆఫీసర్ ఆఫర్‌.. చివరికి..

ఉద్యోగితో ప్రేమలో పడిన 57 ఏళ్ల మహిళా అధికారి అతని భార్యకి షాకింగ్ ఆఫర్ ఇచ్చింది. తన ఆస్తి మొత్తం తీసుకుని ఆమె భర్తని తనకిచ్చేయాలని అడగడంతో ఉద్యోగి భార్య షాక్‌కి గురైంది. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో వివాదంగా మారింది. లేడీ ఆఫీసర్‌ ఆఫర్‌‌తో ఉద్యోగి కుటుంబంలో కలహాలు రేగాయి. ఆఫీసర్‌ని విడిచి ఉండలేనని అతను కూడా చెప్పడంతో పంచాయితీ కోర్టుకు చేరింది. కౌన్సిలింగ్ జరుగుతోంది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగుచూసింది.

ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ మహిళా ఉన్నతాధికారి(57) అదే శాఖలో పని చేస్తున్న ఉద్యోగి(45)తో ప్రేమలో పడింది. ఆమె భర్త పదేళ్ల కిందట మరణించారు. తదనంతర కాలంలో ఆమె కోడలు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం.. అసహ్యించుకుంటుండడంతో తోడు కోసం ఉద్యోగితో దగ్గరైంది. లాక్‌డౌన్ కారణంగా కార్యాలయానికి వెళ్లకపోవడంతో అతనిని చూడకుండా ఉండలేకపోయింది.

Also Read:

సడెన్‌గా ఓ రోజు నేరుగా ఉద్యోగి ఇంటికి వెళ్లింది. వంటగదిలో పని చేసుకుంటున్న ఆమె భార్యని పిలిచి దిమ్మతిరిగిపోయే ఆఫర్ ఇచ్చింది. తన ఆస్తి మొత్తం తీసుకుని.. ఆమె భర్తని తనకిచ్చేయాలని అడగడంతో షాక్‌కి గురైన ఉద్యోగి భార్య గొడవకు దిగింది. ఈ విషయం ఆఫీసర్ కోడలికి కూడా తెలియడంతో అక్కడికి చేరుకుంది. దీంతో వివాదం ముదిరింది. చివరికి పంచాయితీ కోర్టుకు చేరింది.

అయితే సదరు లేడీ ఆఫీసర్‌ని విడిచి ఉండలేనని ఉద్యోగి అతని భార్యకి ట్విస్ట్ ఇవ్వడంతో ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. పెళ్లైన 14 ఏళ్ల తర్వాత తన భర్త తనను మోసం చేశాడని.. భర్తని వదిలిపెట్టేది లేదంటూ కేసు పెట్టడంతో ఇరువర్గాలు వాదనలు జరుగుతున్నాయి. ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here