‘నాతో అఫైర్ పెట్టుకోకపోతే నీ మొగుడిని చంపేస్తా’.. మహిళకు బెదిరింపులు

ఇటీవల కాలంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఓ వివాహితపై కన్నేసిన యువకుడు తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని, లేకపోతో భర్తను చంపేస్తానని వేధిస్తున్నాడు. హర్యానాలోని గురుగ్రామ్‌‌కు చెందిన వివాహిత భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమెపై కన్నేసిన వీరేంద్ర అనే స్థానిక యువకుడు తన కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. తాను అలాంటి దానిని కాదని, తన జీవితాన్ని నాశనం చేయొద్దని మహిళ వేడుకున్నా వినిపించుకోలేదు.

Also Read:

‘నాకు గ్యాంగ్‌స్టర్స్‌తో సంబంధాలున్నాయి, నా కోరిక తీర్చకపోతే నీ భర్తను కాల్చి చంపేస్తా’ అంటూ వివాహితను తీవ్రంగా వేధించాడు. కొన్నాళ్ల పాటు అతడి వేధింపులు భరిస్తూ వచ్చి మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది. వీరేంద్ర బారి నుంచి తనను, తన భర్తను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో క్రైమ్ విభాగం ఏసీపీ ప్రీత్‌పాల్ ఆదేశాలతో పోలీసులు వీరేంద్రపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలోనూ కొందరు మహిళలను ఇదే విధంగా వేధించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here