దేశంలో 30 వేలకు చేరువలో కరోనా కేసులు.. ప్లాస్మా థెరపీపై కేంద్రం సంచలన ప్రకటన

ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా కరోనా నయం అవుతుందడానికి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని తెలిపింది. ప్లాస్మీ థెరపీ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా అధ్యయనం ప్రారంభించిందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశంలో 1543 కొత్త కేసులు నమోదు కాగా.. 62 మంది కరోనాకు బలయ్యారని కేంద్రం ప్రకటించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,435కి చేరగా.. 6868 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. రికవరీ రేటు 23.3 శాతంగా ఉందని ఆయన తెలిపారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 934కు చేరగా.. ఇప్పటి వరకూ 6869 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

టెక్నాలజీని ఉపయోగించి కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నామని కేంద్రం తెలిపింది. గుజరాత్‌లో రెండు కేంద్ర బృందాలు పని చేస్తున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. సూరత్‌లో ఇంటింటి సర్వే చేపడుతున్నామని తెలిపింది. గుజరాత్‌లో చేపడుతున్న సహాయక చర్యల పట్ల కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది.

కరోనా కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉండగా.. నాలుగో స్థానంలో రాజస్థాన్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here