దేశంలో 24 గంటల్లో 1993 కేసులు.. మరికొంత మందికి ఉపశమనం

లా క్‌డౌన్‌తో ఎక్కడికక్కడే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఉపశమనం కలిగించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని నిర్ణయాలు ప్రకటించింది. దేశంలోని పలు చోట్ల చిక్కుకున్న కూలీలు, విద్యార్థులు, యాత్రికులు, ఇతరులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ప్రత్యేక రైళ్ల ద్వారా వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో పాటు సరకు రవాణాకు ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలనీ.. ట్రక్కుల రవాణాకు అనుమతించాలని ఆదేశించింది.

దేశంలో పరిస్థితులు, కరోనా వైరస్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం (మే 1) సాయంత్రం మీడియాతో మాట్లాడారు. గురువారం జారీ చేసిన ఆదేశాలకు తదుపరి ఉత్తర్వులు ఇస్తున్నట్లు హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ తెలిపారు.

మరోవైపు.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,043కు చేరినట్లు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 564 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. రికవరీ రేటు 25.37 శాతంగా ఉన్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here