దంపతులు సహా కూతురి దారుణ హత్య.. మైనర్ బాలికపై అత్యాచారం.?

మైనర్ బాలిక సహా ముగ్గురిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి వేళ ఇంట్లో చొరబడి గొంతులు కోసేశారు. దంపతులతో సహా వారి కూతురిని అత్యంతర కిరాతకంగా అంతమొందించారు. మృతదేహాలను చెల్లాచెదురుగా పడేయడంతో భయానక వాతావరణం నెలకొంది. పదిహేనేళ్ల మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటన యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వెలుగుచూసింది.

పదిహేనేళ్ల కూతురితో దంపతులను దారుణంగా హత్య చేసిన సంఘటన ప్రయాగ్ రాజ్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు ముగ్గురి గొంతులు కోసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ముగ్గురి మృతదేహాలను ఇంటి పరసరాల్లో చెల్లాచెదురుగా పడేశారు. వృద్ధ దంపతుల మృతదేహాలు ఇంటి బయట పడి ఉండగా.. బాలిక మృతదేహం ఇంటి లోపల ఉంది. బాలికను హత్య చేసే ముందు ఆమెను రేప్ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంలను రప్పించి సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. కుటుంబ తగాదాలు.. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అదే గ్రామంలో వేరుగా ఉంటున్న మృతుడి కుమారుడిని అడిగా వివరాలు సేకరించారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని కొడుకు చెప్పాడు.

అయితే తన తమ్ముడు ముంబైలో ఉంటాడని.. అతని భార్య గతంలో కొద్దిరోజుల కిందట తల్లిదండ్రులతో గొడవపడినట్లు చెప్పాడు. చంపేస్తానని బెదిరించిందని పేర్కొన్నాడు. ఆ దిశగానూ పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక శవం ఇంటి లోపల పడి ఉండడం.. వృద్ధ దంపతుల ఆభరణాల వంటి విలువైన వస్తువులు కనిపించకపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here