తెరుచుకుంటున్న మద్యం షాపులు.. ధరల పెంపు

లా క్‌డౌన్‌తో మూతబడ్డ మద్యం షాపులు క్రమంగా తెరచుకుంటున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లలో పలు నిబంధనలతో వైన్ షాపులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టి కేంద్రీకరించాయి. కర్ణాటకలో 47 రోజుల తర్వాత సోమవారం (మే 4) నుంచి మద్య విక్రయాలు కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పలు ఆంక్షలతో మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న అసోంలో తక్షణమే మద్య విక్రయాలు అమల్లోకి తీసుకొస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల వరకు పొడిగించిన మోదీ సర్కార్.. కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మద్యంప్రియులకు గుడ్ న్యూస్ అందించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులను అనుమతి ఇచ్చింది. రెడ్ జోన్లలోనూ కంటెయిన్‌మెంట్ ప్రాంతాలు లేనిచోట వైన్ షాపులకు అనుమతి ఇచ్చింది. అయితే.. కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని నిర్దేశించింది.

Must Read:

కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని వైన్ షాపు నిర్వాహకులకు ప్రభుత్వం సూచించింది. పరిశుభ్రత పాటించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. నగదు లావాదేవీల సమయంలోనూ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వైన్ షాపులకు అనుమతి ఇచ్చినా.. లాక్‌డౌన్ ముగిసే వరకు పబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం మద్యం కౌంటర్లు తెరిచి విక్రయాలు సాగిస్తామన్నా.. కుదరదని హెచ్చరించింది. మార్కెట్లు, మాళ్లలోని మద్యం షాపులకు కూడా అనుమతి లేదని తెలిపింది.

అసోం ప్రభుత్వం ఏప్రిల్ 12నే మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల అనంతరం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మద్యం విక్రయాలను నిలిపేసింది. ఆ రాష్ట్రంలో మద్యం షాపులను తెరిపించాలని ఆది నుంచే పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. అధికార కూటమిలోని బీజేపీ పార్టీ ఈ డిమాండ్‌కు మద్దతిస్తుండటం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తేసిన.. కేరళ ప్రభుత్వం మాత్రం మద్యంప్రియులు మరి కొంత కాలం ఆగాల్సిందేనని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ ముగిసే మే 17 వరకు మద్యం షాపులను మూసే ఉంచాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయించారు. మద్యం గురించి ఆందోళన అక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ జోన్లలో లిక్కర్ డిస్టెల్లరీలు తెరిచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదే సమయంలో లిక్కర్ ధరలను 25 శాతం పెంచింది. మరి కొన్ని రాష్ట్రాలు కూడా ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here