ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 223 కేసులు

దే శ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం (మే 1) ఒక్క రోజే ఢిల్లీలో 223 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3738కి చేరుకుంది. అయితే.. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం వల్లే పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 2,300 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు.

మరోవైపు కరోనా రోగుల చికిత్స కోసం ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలను ఇస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 1100 మంది తమ ప్లాస్మాను ఇతర రోగులకు అందించేందుకు సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు. కరోనా రోగులకు చికిత్సలో తోడ్పడటానికి వారంతా ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,043కు చేరినట్లు వెల్లడించారు. వీరిలో 9 వేల మందికి పైగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 564 మంది కోలుకున్నారని అవ్ అగర్వాల్ తెలిపారు. రికవరీ రేటు 25.37 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here