డెలివరీ బాయ్ ముస్లిం అని.. సరుకులు వద్దన్న కస్టమర్ జైలుకి..

కరోనా వంటి భయానక పరిస్థితుల్లోనూ మతఛాందసవాదుల్లో మార్పు రావడం లేదు. కేవలం మతం కారణంగా ఎదుటి వ్యక్తిని దూరంగా ఉంచే నీచసంస్కృతిని విడనాడకపోగా.. ముఖంమీదే అవమానించిన అమానుష ఘటన ముంబైలో వెలుగుచూసింది. లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. నిత్యవసరాల సరుకులు తెచ్చుకునేందుకు మాత్రమే నిర్ణీత వేళల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు.

ప్రజలు బయటికి రాకుండా ఉండేందుకు వంటి మహానగరాల్లో నిత్యవసరాల డోర్ డెలివరీని కూడా అనుమతిస్తున్నారు. పలు ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. అందులో భాగంగా నిత్యవసరాలను డోర్ డెలివరీ చేస్తున్న ఓ డెలివరీ బాయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కి డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో ఊహించని ఘటనతో షాక్‌కి గురయ్యాడు.

Also Read:

డెలివరీ బాయ్ అవడంతో సరుకులు తీసుకునేందుకు కస్టమర్ నిరాకరించాడు. సరుకులు తీసుకునేందుకు వచ్చిన తన భార్యతో ఆర్డర్ రిటర్న్ చేయమని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వేరే మతానికి చెందిన వ్యక్తి నుంచి సరుకులు తీసుకునేది లేదని ఆయన చెప్పడంతో డెలివరీ బాయ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి డోర్ డెలివరీ చేస్తున్నామని.. కనీస మానవత్వం లేకుండా కస్టమర్ వ్యవహరించిన తీరుతో డెలివరీ బాయ్ మనస్థాపానికి గురయ్యాడు.

Read Also:

అక్కడ జరిగిన తతంగమంతా డెలివరీ బాయ్ తన సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కస్టమర్ ప్రవర్తనతో మనస్థాపానికి గురైన డెలీవరీ బాయ్ పోలీసులను ఆశ్రయించాడు. చేతులకు గ్లౌజ్, ముఖానికి మాస్క్ వంటి రక్షణ చర్యలు పాటిస్తూ డోర్ డెలివరీ చేస్తున్నానని.. కానీ వేరే మతానికి చెందిన వ్యక్తినంటూ సరుకులు తీసుకోకుండా అవమానపరిచారని ఫిర్యాదు చేశాడు. మత నమ్మకాలను అవమానపరిచేలా వ్యవహరించిన నేరం ఐపీసీ సెక్షన్ 295(ఏ) కింద కేసు నమోదు చేసిన పోలీసులు కస్టమర్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here