జైల్లో ఉన్నా బతికేవారేమో.! బ్రదర్స్‌ని కొట్టిచంపేసిన గ్రామస్థులు.. కారణం తెలిస్తే షాకే..

జైల్లో ఉన్నా బతికి ఉండేవారేమో.. కరోనా కారణంగా జైలు నుంచి బయటికొచ్చి ప్రాణాలు కోల్పోయారు అన్నదమ్ములు. సుప్రీం మార్గదర్శకాల మేరకు జైలు నుంచి విడుదలైన అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. ఊళ్లో అడుగుపెట్టగానే గ్రామస్థులు చావబాదడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయిన ఘటన అస్పాంలో చోటుచేసుకుంది.

జైలు నుంచి విడుదలై గ్రామానికి వచ్చిన అన్నదమ్ములను గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన బక్సా జిల్లాలోని సిమాలుగురి ప్రాంతంలో జరిగింది. అతియబరి గ్రామానికి చెందిన బిశ్వజిత్, హరధాన్ దాస్ అన్నదమ్ములు. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన కేసుల్లో ఇద్దరూ జైలు పాలయ్యారు. ఆయా కేసుల్లో నేరం రుజువవడంతో శిక్ష అనుభవిస్తున్నారు.

Also Read:

కరోనా పుణ్యమాని జైల్లో ఉండాల్సిన అన్నదమ్ములు బయటికొచ్చి ప్రాణాలు కోల్పోయారు. జైళ్లలో వ్యాప్తి చెందే అవకాశాలుండడంతో ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అన్నదమ్ములిద్దరూ జైలు నుంచి విడుదలయ్యారు. కొద్దిరోజులు బంధువుల ఇంట్లో ఉన్న బ్రదర్స్.. స్వగ్రామానికి వెళ్లారు.

దోపిడీలు చేసి జైలుకి వెళ్లొచ్చిన బ్రదర్స్‌పై కోపంగా ఉన్న గ్రామస్థులు వారితో గొడవకు దిగారు. ఊళ్లోకి ఎందుకొచ్చారంటూ గొడవపడి మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో అన్నదమ్ములు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అన్నదమ్ములను ఎందుకు కొట్టి చంపారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు బక్సా ఎస్పీ ప్రతీక్ విజయ్ కుమార్ తెలిపారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here