చైనా ర్యాపిడ్ కిట్ల ఆర్డర్ రద్దు.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

కరోనా పరీక్షల వేగాన్ని పెంచడం కోసం చైనా నుంచి కేంద్రం ఏప్రిల్ నెలలో 5 లక్షలకుపైగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లకు ఆర్డర్ పెట్టింది. కాగా ఈ కిట్ల పనితీరు పట్ల రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందడంతో కేంద్రం వాటిని చైనాకు తిప్పి పంపుతోంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. రెండు చైనీస్ కంపెనీల ర్యాపిడ్ టెస్టు కిట్లను ఉపయోగించొద్దని.. వాటిని సప్లయర్లకు తిప్పి పంపుతామని ఐసీఎంఆర్ రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ప్రకటన చేసింది. బెయోమెడీమిక్స్, వోండ్ఫో సంస్థలకు ఇచ్చిన ఆర్డర్‌కు సంబంధించిన ఫ్యాక్ట్ షీట్‌ను కూడా కేంద్ర ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది.

‘‘కరోనా పరీక్షల సంఖ్యను పెంచడం కోసం ఐసీఎంఆర్ చేయాల్సిందంతా చేస్తోంది. ఇందుకోసం కిట్లను సేకరించి వాటిని రాష్ట్రాలకు అందజేయాల్సి ఉంది. అంతర్జాతీయంగా కిట్లకు భారీ డిమాండ్ ఉందది. చాలా దేశాలు కిట్లను కొనుగోలు చేయడం కోసం అన్ని మార్గాలను ఉపయోగిస్తున్నాయి. కిట్ల కోసం ఐసీఎంఆర్ ప్రయత్నించగా.. ముందు సప్లయర్లు స్పందిచలేదు. రెండోసారి వారి నుంచి సరైన స్పందన లభించింది. రెండు సంస్థల నుంచి కిట్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాం. వోండ్ఫో కోసం ఎవల్యూషన్ కమిటీకి రూ. 1204, రూ. 1200, రూ. 844, రూ. 600 చొప్పున బిడ్లు వచ్చాయి. రూ.600 బిడ్ ఆఫర్‌ను ఎల్-1గా పరిగణించాం. అదే సమయంలో వోండ్ఫో నుంచి సీజీఐ ద్వారా కిట్లను నేరుగా తెప్పించడానికి ఐసీఎంఆర్ ప్రయత్నించింది. కానీ కుదర్లేదు.

క్షేత్ర స్థాయిలో ఈ కిట్ల పనితీరు గురించి ఐసీఎంఆర్ శాస్త్రీయంగా అంచనా వేసింది. వోండ్ఫో కిట్ల పనీతీరు ఆశాజనకంగా లేదు. మరో కిట్లు సంస్థ కిట్ల పనితీరు కూడా సంతృప్తికరంగా లేదు. దీంతో వాటిని రద్దు చేశారు. ఈ ప్రక్రియలో భారత్‌కు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లలేదు. సప్లయర్లకు ఐసీఎంఆర్ ఎలాంటి చెల్లింపులు చేపట్టలేదు’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here