చైనా ఎదురుదాడి ముమ్మరం చేసిన అమెరికా.. సెనేట్‌లో కీలక బిల్లు

కరోనా వైరస్‌ విషయంలో ముందు నుంచి చైనాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న అగ్రరాజ్యం అమెరికా.. డ్రాగన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా కాంగ్రెస్‌లో ఓ కీలక బిల్లును అమెరికా ప్రవేశపెట్టింది. గురించి పూర్తి సమాచారం అందజేసి, సహకరించని పక్షంలో చైనాపై కఠిన ఆంక్షలు విధించాలని పేర్కొంటూ రూపొందించిన బిల్లుపై తొమ్మిది మంది కీలక సెనేటర్లు సంతకాలు చేసి, మంగళవారం సెనేట్‌ ముందుంచారు.

‘ది కొవిడ్‌-19 అకౌంటబిలిటీ యాక్ట్‌’ పేరిట రూపొందించిన ఈ బిల్లులో కీలక అంశాలను ప్రస్తావించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిలో చైనా పాత్రపై జరుగుతున్న అమెరికా, దాని మిత్రపక్షాలు, ఐరాస అనుబంధ సంస్థ డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థల విచారణకు డ్రాగన్‌ నుంచి పూర్తి సహకారం లభించాలని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని అందజేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు, ఈ విషయంలో చైనా పూర్తి సమాచారం అందించిందో? లేదో? అధ్యక్షుడు ట్రంప్‌ 60 రోజుల్లోగా కాంగ్రెస్‌కు తెలియజేయాలని కోరారు. అలాగే చైనాలోని జంతు మాంసం విక్రయశాలల్ని సైతం మూసివేయాలని ఉద్ఘాటించారు.

ఒకవేళ సమగ్రమైన సమాచారం అందించడంలో చైనా విఫలమైన పక్షంలో.. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆస్తుల్ని స్తంభింపజేయడం, ప్రయాణ నిషేధాలు, వీసా ఉపసంహరణలు, అమెరికా ఆర్థిక సంస్థల నుంచి రుణాల నిలుపుదల, అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో చైనా సంస్థల్ని నిషేధించడం వంటి ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌నకు అధికారం దఖలుపడనుందని ఈ బిల్లులో స్పష్టం చేశారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రమేయం లేకుండా అమెరికాకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే లేదని తాను బలంగా నమ్ముతున్నానని బిల్లు రూపకర్త లిండ్సే గ్రాహం ఆరోపించారు. అంతేకాదు, వైరస్ విషయంలో దర్యాప్తునకు వుహన్‌ ల్యాబ్‌లో అంతర్జాతీయ సమాజానికి అనుమతి నిరాకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్ వైరస్‌ ఎలా మొదలైంది… దాన్ని ఎలా అరికట్టాలనే దిశగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, అందుకు చైనా ఏమాత్రం సహకరించడం లేదని ఆయన దుయ్యబట్టారు. తాజా చట్టం ద్వారా ఒత్తిడి పెరిగి చైనా సహకరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో ఆంక్షలు విధించాల్సిందేనని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here