చీరాలలో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే..?

యువకుడి దారుణ హత్య చీరాలలో కలకలం రేపింది. చీరాలలోని హారీస్ పేటకు చెందిన నల్లగుంట్ల దినేష్‌(21) బైక్‌పై స్నేహితుడితో కలసి వెదుళ్లపల్లి వైపు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. మండల పరిధిలోని తోటవారిపాలెం కృపానగర్ వద్ద బైక్‌ ఆపి దినేష్‌తో గొడవపడ్డారు. అనంతరం తమతో తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడిచేసి అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్రగాయాల పాలైన దినేష్ అక్కడికి సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి విషయం చెప్పి కుర్చీలో కూర్చుని ప్రాణాలు వదిలాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read:

దినేష్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రియురాలి కుటుంబ సభ్యులు, లేదా మరెవరైనా హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రియురాలి ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. మృతుడి కాల్‌డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. అతనికి ఫోన్ చేసి వెదుళ్లపల్లి రమ్మని చెప్పింది ఎవరు? తదితర విషయాలపై పోలీసులు దృష్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here