చిత్తూరులో ఘోరం.. నిద్రిస్తున్న వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణ హత్య

ఆరుబయట ఒంటరిగా నిద్రిస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేసిన దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కార్వేటి నగరం మండలం డీఎం పురం గ్రామానికి చెందిన చిరంజీవి(35)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాత్రి 10.30 గంటల సమయంలో కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు. కత్తిపోట్లకు గురైన చిరంజీవి అక్కడికక్కడే మరణించాడు. శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ మురళీధర్ మృతదేహాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం స్పాట్‌కి చేరుకుని ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాల కారణంగానే హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. మృతుడి కుటుంబీకులు పలువురిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read:

ఈ ఘటనపై డీఎస్పీ మురళీధర్ స్పందించారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చిరంజీవిని కత్తులతో పొడిచి చంపేశారన్నారు. కుటుంబ సభ్యులను విచారించామని.. అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నామన్నారు. ఆస్తి వివాదాలు, మరేమైనా సంబంధాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా? అనే విషయమై దర్యాప్తు చేపట్టామని.. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here