చదువుకుందామని వస్తే.. మత్తు మందిచ్చి మరదలిపై అత్యాచారం

ఉన్నత చదువుల కోసం తన ఇంటికి వచ్చిన మరదలిపై కన్నేసిన ఓ కామాంధుడు మత్తు మందిచ్చి లైంగికంగా దోచుకున్న ఘటన జార్ఖండ్‌లో వెలుగుచూసింది. హజారీఘర్‌ జిల్లాలోని ఓ పట్టణానికి చెందిన రామ్‌ భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. ఉన్నత చదువుల కోసం భార్య చెల్లెలు అతడి ఇంటికి వచ్చి ఉంటోంది. వయసులో ఉన్న మరదలిపై రామ్‌ కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని నిర్ణయించుకున్నాడు.

Also Read:

ఓ రోజు అతడి భార్య, పిల్లలను తీసుకుని బయటకు వెళ్లింది. ఆ సమయంలో రామ్, అతడి మరదలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. తన కోరిక తీర్చుకునేందుకు ఇదే సరైన సమయమని భావించిన రామ్.. ఆమెతో మాటలు కలిపి తినే ఆహారంలో మత్తు మందు కలిపాడు. దాన్ని తిన్న యువతి మత్తులోకి జారుకోగా.. బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read:

కాసేపటి తర్వాత మెలకువ వచ్చిన యువతి తనపై బావ జరిగినట్లు తెలుసుకుని కుమిలిపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారి సలహాతో స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రామ్‌పై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here