గుడ్‌న్యూస్‌.. లాక్‌డౌన్‌తో క‌రోనాకు ఇండియా చెక్‌.. ష‌ట్‌డౌన్ లేకుంటే ఎన్ని కేసులో తెలుసా..?

క‌రోనా వైర‌స్‌ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు నెల‌రోజుల‌ కింద‌ట దేశ‌వ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్ (ష‌ట్‌డౌన్‌)ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ విధించ‌డం ద్వారా క‌రోనా పాజిటివ్ కేసుల త‌గ్గుద‌ల న‌మోదైన‌ట్లు తాజాగా అధ్య‌య‌నంలో తేలింది. లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డానికి ఒక‌రోజు ముందు.. అంటే మార్చి 24న దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 500వ‌ర‌కు న‌మోద‌య్యాయి. అప్ప‌ట్లో పాజిటివ్ కేసుల వృద్ధి 21.6 శాతంగా న‌మోదైంది. ఒకవేళ అదే వృద్ధిరేటు ఈ నెల‌రోజుల్లో నమోదైతే క‌రోనా కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటి ఉండేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Must Read:

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల వృద్ధి 6.1 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 24,700కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 780 మందికిపైగా మ‌ర‌ణించారు. మ‌రోవైపు 8.1 శాతం వృద్ధిరేటు కూడా ఆందోళ‌నక‌ర‌మేన‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇదే వృద్ధిరేటు కొన‌సాగితే వ‌చ్చేవారం చివ‌ర‌కు 40వేల‌కుపైగా పాజిటివ్ కేసులు నమోద‌వుతాయని అంచ‌నా వేస్తున్నారు.

Must Read:

మ‌రోవైపు ఈ వృద్దిరేటును వీలైనంత త‌క్కువ‌కు తీసుకురావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. ఈ రేటును 6 శాతానికి కుదిస్తే నెలాఖ‌రువ‌ర‌కు 1.3 లక్ష‌లు, 5 శాతానికి ప‌రిమితం చేస్తే ఒక ల‌క్ష‌లోపు కేసులు నమోద‌వుతాయ‌ని పేర్కొంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా క‌రోనా ప‌రిశీల‌న‌కు మ‌రో నాలుగు ఇంట‌ర్ మినిస్టీరియ‌ల్ సెంట్ర‌ల్ టీమ్స్‌ను కేంద్రం నియ‌మించింది. ఇవి సూర‌త్‌, అహ్మ‌దాబాద్ (గుజ‌రాత్‌), హైద‌రాబాద్ (తెలంగాణ‌), చెన్నై (త‌మిళ‌నాడు)ల్లో ఈ టీమ్‌లు ప‌ర్య‌టించ‌నున్నాయి. కేంద్రం ఇప్ప‌టికే ఆరు ఐఎంసీటీల‌ను కేంద్రం నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here