క్లింటన్, గేట్స్ ఫ్యామిలీకి ఈవెంట్ మేనేజర్.. కానీ కరోనా దెబ్బకి కకావికలం.. న్యూజెర్సీలో భారతీయ జంట విషాదాంతం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకి జీవితాలు తలకిందులవుతున్నాయి. కష్టపడి నిర్మించుకున్న ఆశల సౌధాలు కళ్లెదుటే కూలిపోతుంటే తట్టుకోలేక కొందరు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఎంతో కష్టపడి ప్రారంభించిన కొత్త రెస్టారెంట్ రోజుల వ్యవధిలోనే మూతపడడంతో భారతీయ జంట ప్రాణాలొదిలిన సంఘటన న్యూజెర్సీలో వెలుగుచూసింది. రెస్టారెంట్ మూతపడడం వల్లే భార్యను చంపేసి.. భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్‌కి చెందిన గరిమా కొఠారి(35) చెఫ్. మాస్టర్ చెఫ్ ఇండియా పోటీల్లో ఆమె ఫైనలిస్ట్ కూడా. అంతటి పేరు ప్రఖ్యాతులున్న కొఠారి న్యూజెర్సీలో నుక్కాడ్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు. కరోనా మహహ్మరి విజృంభణకు ముందు ఫిబ్రవరిలో ఆమె రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే కరోనా కారణంగా రెస్టారెంట్ నెలరోజులు కూడా తిరక్కముందే మూసివేయాల్సి వచ్చింది. ఆమె ఎలాగైనా రెస్టారెంట్ తీసి ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

Also Read:

సడెన్‌గా ఆమె తన అపార్ట్‌మెంట్‌లో శవంగా మారారు. క్రిస్టోఫర్ కొలంబస్ డ్రైవ్‌లోని తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యగా తేల్చారు వైద్యులు. ఆమెను ఎవరో దారుణంగా గాయపరచి చంపేసినట్లు స్పష్టం చేశారు. ఆమె ఐదు నెలల గర్భిణి కావడం మరో విషాదం. కొఠారి చనిపోయిన మరుసటి రోజే ఆమె భర్త మన్మోహన్ మాల్ హడ్సన్ నదిలో శవమై తేలారు. ఆయన మరణానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది.

Read Also:

ఎన్నో ఆశలతో స్టార్ట్ చేసిన రెస్టారెంట్ ఒక్కసారిగా మూతపడడంతో ఇద్దరూ డిప్రెషన్‌కి గురైనట్లు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే భార్యని హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. కొఠారి గతంలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. క్లింటన్ కుటుంబం, మిలిందా గేట్స్, సారా జెస్సికా పార్కర్ వంటి ప్రముఖులతో పనిచేసినట్లు తెలుస్తోంది. మన్మోహన్ ఐఐటీ ఖరగ్‌పూర్‌‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కొలంబియా వర్సిటీలో ఉన్నత చదువులు అభ్యసించినట్లు సమాచారం.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here